14, డిసెంబర్ 2020, సోమవారం

దళితుల అభివృద్ధిని నిర్ణయించేది కులమా? కృషా???


ఒక వ్యక్తి గాని, కుటుంబం గాని, ఒక వెనుకబడిన కులం గాని ఆర్థికంగా ఎదగాలంటే ముందు కష్టపడి పనిచేసి సంపాదించడం నేర్చుకోవాలి. తరువాత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ... పిల్లలకు మంచి చదువు, మంచి వాతావరణం అందించాలి.

అంతేకానీ కేవలం కులం వల్ల పేదవాళ్లం అయ్యామని జీవితాంతం  ప్రభుత్వాలు అమలు చేసే పథకాల పై ఆధారపడి, కేవలం ఓటు బ్యాంకుగా బతకడం వల్ల వ్యవస్థలో మార్పు రాదు.

70 సంవత్సరాల కు పైగా అన్ని ప్రభుత్వాలు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాయి. మరి పేదరికం ఎందుకు తగ్గలేదు. కనీసం ప్రభుత్వాల నుండి లక్షలాది రూపాయలు వివిధ రకాల రుణాలు పొందిన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు ఆర్థికంగా అభివృద్ధి చెంది... పేదరికం నుండి బయటకు రాలేదు?

రోజంతా కష్టపడి పనిచేసి వచ్చిన కూలి డబ్బులను మద్యానికి మరియు ఇతర చెడు అలవాట్లకు ఖర్చుపెట్టే పేదవాళ్లను... ఏ ప్రభుత్వమైనా ఎలా అభివృద్ధి చేయగలదు. అంబేద్కర్ మా దేవుడు అని చెప్పే దళితులు ఎంతమంది ఇది ఆయన జీవితంలో అనుసరించిన విలువలను , వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తున్నారు?

చాలామంది అనుకుంటారు డబ్బు ఉన్న వాళ్లందరికీ... అదిఊరికే వచ్చిందని... లలిత జ్యువెలరీ యజమాని చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు. సంవత్సరాల తరబడి కష్టపడి... పొదుపుగా... క్రమశిక్షణతో... చెడు అలవాట్లకు దూరంగా ఉన్నప్పుడే ఎవరైనా సంపద పెంచుకోగలరు.

మన ఆర్థిక పరిస్థితి  బాగా లేనప్పుడు కులంతో సంబంధం లేకుండా... దగ్గర బంధువులు కూడా దూరంగా పెడతారు... అదే ఆర్థికంగా మనం ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కులాలతో సంబంధం లేకుండా అందరూ మన దగ్గరికి వస్తారు. అనుబంధం... ఆత్మీయత... అంతా ఒక నాటకం... మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ 150 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అది నిజం... అదే నిజం.

కాబట్టి సామాజిక గౌరవం, రాజకీయ సాధికారత, సాంస్కృతిక అభివృద్ధి సాధించాలనుకునే దళితుల్లారా... ముందు...కష్టపడి పనిచేయడం నేర్చుకోండి...

కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాగా చదువుకోండి... ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది.

మిమ్మల్ని నిరంతరం నిరుపేదల ఉంచుతున్న చెడు అలవాట్లనుండి బయటపడాలి... క్రమశిక్షణతో... ఆరోగ్యంతో... సంతోషంగా బతికే ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకోండి...

అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది...

అప్పుడే అంబేద్కర్ కలలు  నిజమవుతాయి.

అభివృద్ధి చెందిన కులాలను చూడండి... వాళ్ళ నుండి  మంచి లక్షణాలను నేర్చుకోండి. వారి కన్నా మరింత కష్టపడి ముందుకు వెళ్ళటానికి ఆలోచించండి.

చివరిగా ఇద్దరు అద్భుతమైన దళితుల గురించి చెబుతాను.

*మొదటి వ్యక్తి కంకర చంద్రయ్య*

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ ప్రపంచం మొత్తం తెలుసు. థియేటర్ యజమాని పేరు ముడుపు చంద్రయ్య లేదా కంకర చంద్రయ్య. ఆయనకు హైదరాబాద్ నగరంలో మరో 10 థియేటర్లు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అయితే ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే ఆయన బతుకు తెరువు కోసం 50 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి రోడ్ల నిర్మాణంలో కంకర మోసే రోజు వారి కూలీగా పనిచేసిన ఒక మాదిగ కులస్తుడు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో, మూసాపేట లో, కూకట్పల్లిలో, హైటెక్ సిటీ లో... అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఆయన జంట థియేటర్లను కట్టాడు...

బతుకు తెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చిన ఒక నిరుపేద మాదిగ ఈరోజు వందల కోట్ల రూపాయలకు యజమాని.

*రెండో వ్యక్తి తుళ్లూరు కు తాడికొండకు మధ్యలో ఉన్న పెదపరిమి కి చెందిన సర్వ ఎలమంద అనే మాల కులస్తుడు*

అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎలమంద స్వయంకృషితో ఎదిగి ఈరోజు రాజధాని గ్రామాల్లో కమ్మ వారికి కూడా లేనంత భూమిని... దాదాపు 80 ఎకరాలు  సంపాదించుకున్నాడు. అతని కులంతో సంబంధం లేకుండా అందరూ ఆయన్ని గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన రియల్ హీరో.


ఇప్పుడు ఆలోచించండి...

మన అభివృద్ధి నిర్ణయించేది కులమా? కృషా???


స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన

మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..! పంచాయతీ అంటే ◆ గ్రామ సభ ◆ గ్రామపంచాయతీ వార...