20, జనవరి 2021, బుధవారం

కమ్మవారి పై అకారణ ద్వేషం ఎందుకు ??

 ఇవాళ సమాజం లో కమ్మవారి పై అకారణ ద్వేషం పెంచుకోవటం, వారిని సోషల్ మీడియా లో అగౌరవ పరిచి పైశాచిక ఆనందం పొందటం మనం చూస్తూనే ఉన్నాం. ఇది నిన్న మొన్న మొదలైనిది కాదు కాని తెలంగాణా ఉద్యమ సమయం లో వెర్రి తలలు వేసింది. తెలంగాణ ని దోచుకుంటుంది ఆంధ్రులు అని  ఆ ఆంధ్రులు అంటే కమ్మవారే అని ఉత్తర తెలంగాణా లో విపరీత ప్రచారం చేసారు. 

ఏదైనా రంగంలో ఒక వర్గం వారు తరతరాలుగా పాతుకుపోయినపుడు కొత్తగా ఇంకో వర్గం అదే రంగం లో అడుగుడి ఆదిపత్యం కోసం ప్రయత్నిచినపుడు సహజం గానే కొత్తగా వచ్చిన వారిపై ద్వేష భావం ఉంటుంది. మూడు వంతులు కమ్మవారి పై ద్వేష భావం రావడానికి కారణం అదే.

కమ్మవారు ఏకకాలం లో విద్య లో బ్రాహ్మణులకి, వర్తకం లో వైష్యులకి, రాజకీయాల్లో రెడ్డ్లకి, మిగిలిన రంగాల్లో ఇతర కులస్తులకి పోటి ఇవ్వగలరు. అదే చాలామటుకు ద్వేష భావానికి కారణం అయింది. 

సమాజంలో పౌరోహిత్యం ని నమ్ముకొన్న బ్రాహ్మణులకి పోటి గా ప్రముఖ హేతువాది కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు మొదలెట్టిన సూతశ్రమం  తో ఇతర కులస్తులని అందులో ముఖ్యం గా కమ్మవారిని బెనారస్ హిందు యూనివర్సిటీ కి పంపి సంస్కృతం, వేద పఠనం లాంటివి చేయించడమే కాకుండా స్వయంగా తాను వివాహ విధి అని పుస్తకం రచించి వివాహ సమయం లో బ్రాహ్మణుల కి అకారణంగా ఇవ్వబడుతున్న  అగ్ర తాంబూలాన్ని తగ్గించడమే కాక పేదవారికి అధిక ఖర్చు కాకుండా  ఆ విధి ని simplify చేసారు. 

అలాగే ఇవాల్టి ఆధునిక విద్య లో కూడా కమ్మవారు దూసుకెల్లడం చూస్తూనే ఉన్నాం మెడిసిన్ ఇంజనీరింగ్ సివిల్స్ రంగం ఎదైన సరే మొదటి పది స్థానాల్లో కనీసం రెండు కమ్మ వారికీ దక్కడం చూస్తూనే ఉన్నాం. 

వ్యాపార రంగాన్నే నమ్ముకొని గ్రామాల్లో, పట్టణాల్లో తరతరాలుగా చిల్లర టోకు వర్తకం వైశ్యులు చేసేవారు. వడ్డీలకి  అప్పులు ఇచ్చేవారు. అందులో లాభం చూసినా కమ్మవారు వ్యవసాయం తో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేపట్టి వైశ్యులకు  పోటి అయ్యారు అంతే కాకుండా కమ్మవారు  వారి పిల్లల చదువుల కోసం పట్టణాలకి వలస వెళ్లి గ్రామాల్లో పొలాలని కౌలుకి ఇచ్చి  అక్కడ బతుకు దేరువుకి చిల్లర వ్యాపారాలు పెట్టుకొని ఆ ఉపాధి కూడా దెబ్బకొట్టారు. ఆ తర్వాత గ్లోబలైజేషన్ పుణ్యమా అని రకరకాల వ్యాపారాల్లోకి దిగి ఇవాళ తెలుగు రాష్టాల్లో టాప్ 5 ధనవంతుల్లో మొదటి రెండు స్థానాల్లో కమ్మవారే ఉన్నారు.

మన రాష్ట రాజకీయాల్లో స్వతoత్రం రావడానికి పూర్వం నుండే కాంగ్రెస్ ఎక్కువగా బ్రాహ్మణుల ఆదిపత్యం కొనసాగేది కమ్యూనిస్ట్ లా ప్రభావం ఎక్కువగా కమ్మవారి పై ఉండేది. అలాంటి సమయం లో కాంగ్రెస్ లో బ్రాహ్మణుల ఆదిపత్యం పోయి రెడ్డ్ల ఆదిపత్యం వచ్చింది ఆలాంటి సమయం లో అప్పటికే  కాంగ్రెస్ లో రెండు గ్రూప్లు గా ఉన్న నీలం సంజీవ రెడ్డి ఆచార్య NG రంగా వర్గాల మద్య పోరు తో రాజకీయాల్లో కమ్మ-రెడ్డి గొడవలకి బీజం పడింది. అది TDP స్థాపన  తో  రెడ్డ్ల ఆదిపత్యానికి గండి కొట్టి  రాజ్యాధికారం రుచి చూడని చాల కులాలకి సీట్స్ ఇచ్చి, గెల్పించి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాధికారం లో  వాటా కలిపించి రెడ్డ్ల monopoly కి దెబ్బకొట్టడం కూడా వారి అహం దెబ్బ తీసింది. 

బెజవాడ లో రెండు ముఠాల మద్య మొదలైన రౌడీ తగాదాలు ఆ తర్వాత విషమించి రెండు కులాల మద్య తగవుగా హత్య ప్రతి హత్య లతో శృతిమించి అన్నదమ్ముల లాగా కలిసి ఉండే  కమ్మ వారికీ కాపు లకి మద్య దూరం పెంచాయి . 

వీటితో పాటు కమ్మవారి స్వయంకృతాలు కూడా ఉన్నాయి అవే దళితుల పై దాడులు, చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మొదలై హత్యలకి దారి తీసాయి. అప్పటికే విపరీత ద్వేష భావం తో రగిలిపోతున్న ఇతర కులాలు వాటికి మసిపూసి మారేడు కాయ చేసి చిలువలు పలువలుగా రాసి వారి అక్కసు తీర్చుకున్నారు. ఇవాలిటీకి దళితుల పై దాడి అనగానే కమ్మవారి నేతృత్వం లో సాగిన కారంచేడు గురించి  గుర్తించుకొని రాసె  మనుషులు  రెడ్ల నేతృత్వం లో సాగిన మారణఖాండ అయినా చుండూరు గురించి, కాపుల నేతృత్వం లో సాగిన లక్ష్మీoపేట గురించి   గుర్తుండి కూడా  లేనట్లు నటించడం కడు శోచనీయం.

కమ్మవారు సహజంగానే బాగా కస్టపడి చదువు కొని ఆస్తులు పోగేసి  కాస్తంతా డాబుసరిగా ఇల్లులు, కార్లు, బంగారం కొనడం కూడా కొన్ని కులాల్లో కంటగింపుగా మారింది. అది కూడా ఇంకో కారణం. 

కమ్మవారి జనాభా తక్కువగా ఉండటం దానితో వారు సంఘటితం గా ఉండటం కూడా వారి ఎదుగుదలకి కారణం అయింది అదే సంఘటితం కొన్ని చోట్ల శ్రుతిమించి ఇతర కులాల్లో ద్వేష భావాన్ని నింపింది. ఇది కూడా కుల పెద్దలు గమనించి మసులు కుంటే మంచిది. 

ఇకనైనా కమ్మవారు ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే ప్రిన్సిపల్ తో సాటి కులస్థుల తో మంచిగా ఉంటు సహాయ సహకారాలు చేస్తూ ఉంటె  అదే వారి గౌరవాన్ని ఇనుమడింప చేస్తుంది. ఇతర కులస్తులు అకారణంగా ద్వేశించిన వారితో మంచిగా ఉండి కమ్మవారి మంచితనo చూపించి వారి స్నేహ భావం పెంచాలి.

Darkness cannot drive out darkness; only light can do that. Hate cannot drive out hate; only love can do that. Martin Luther King Jr.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన

మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..! పంచాయతీ అంటే ◆ గ్రామ సభ ◆ గ్రామపంచాయతీ వార...